15-11-2025 12:50:35 AM
ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): నగరంలోని భగవతి, ఆర్విన్ ట్రీ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ బి రమణ రావు నెహ్రూ చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి దీప ప్రజ్వలనతో ప్రారంభించారు.
అనంతరం వేదికపై ఉపాధ్యాయులు విద్యార్థులుగా నైపుణ్య వికాస కార్యక్రమంలో భాగంగా నాటక ప్రదర్శన, నృత్య, గానం, మెజీషియన్లుగా విద్యార్థులను నవ్వించగా, స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తరగతులను బోధించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.