calender_icon.png 15 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి

15-11-2025 12:50:21 AM

వనపర్తి మండలం, నవంబర్ 14 : భారత స్వాతంత్య్ర సమరయోధులు, దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న బాలసదనంలో భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నెహ్రూ చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారులతో కేకు కట్ చేయించి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలసదనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక అభినందనలు  తెలియజేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గురుకులంలో..

జడ్చర్ల, నవంబర్ 14: చిల్డ్రన్స్ డే వేడుకల భాగంగా మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్  మినీ గురుకులం జడ్చర్ల పాఠశాలను సందర్శించారు.  విద్యా సామగ్రి ప్రదర్శన ( టిఎల్‌ఎమ్ మేళా)ను ప్రారంభించి పరిశీలించారు.  పాఠశాల అభివృద్ధి, కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల కోసం అందించిన సౌకర్యాలకు ప్రిన్సిపల్ మౌనికని ప్రశంసించారు. ప్రిన్సిపల్ మౌనిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.