calender_icon.png 15 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు

15-11-2025 12:51:31 AM

- కలెక్టర్ కుమార్ దీపక్ 

హాజీపూర్,(విజయక్రాంతి): గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలం లోని పెద్దంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై గిరిజన కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత మరింత అధికంగా ఉన్నందున, చలి ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హాజీపూర్ మండల ప్రభుత్వ ఉద్యోగులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.

జిల్లాలో పివిటిజిలకు 200కు పైగా ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇంటి స్థలం కలిగి ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక చేయూత అందించడంఈ జరుగుతుందన్నారు. గిరిజన పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.