15-11-2025 12:22:59 AM
భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ గారి జయంతి శుభాకాంక్షలు
పిల్లలందరికీ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ
చుంచుపల్లి, నవంబర్ 14, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లోని చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ గ్రామపంచాయతీ ప్రైమరీ హై స్కూల్ నందు శుక్రవారం బాలల దినోత్సవం ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశం సస్యశ్యామలంగా మెలగాలి అంటే దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు అవ్వడం తప్పనిసరి అన్నారు. రాబోవు తరాల్లో ప్రతి ఒక్కరు విద్య పట్ల అత్యధిక ప్రత్యేక దృష్టి సారించి విద్యాబుద్ధులు నేర్చుకొని దేశానికి గర్వకారంగా నిలవాలని కోరారు.
ఉపాధ్యాయులు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. అనంతరం విద్యార్థులందరికీ పుస్తకాలు పెన్సిళ్లు పెన్నులు అందజేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు షేక్ అబ్దుల్ హమీద్, షేక్ షాను, కాటి సందీప్, తదితరులు పాల్గొన్నారు.