calender_icon.png 15 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొలంబాట పట్టిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

15-11-2025 12:21:42 AM

  1. రఘునాథపాలెం మండలం రజబ్ అలీ నగర్‌లో పొలాలు సందర్శించిన మంత్రి తుమ్మల 

పామాయిల్ సాగు చేయాలని రైతులకు సూచన

ఖమ్మం, నవంబర్ 14 (విజయ క్రాంతి): పత్తి మొక్కజొన్న సాగుకు బదులు పామాయిల్ సాగుతో రైతులకు లాభాలు వస్తాయ ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి రఘునాధపాలెం మండలంలో శుక్రవారం పర్యటన సందర్భం గా మార్గమధ్యలో రజబ్ అలీ నగర్ గ్రామం లోని పొలాలను సందర్శించారు. బాణోత్ వీరన్న- విజయ లకు చెందిన పొలం వద్దకు వెళ్లి, ఏ పంట వేస్తున్నది, గతంలో ఎంత దిగుబడి వచ్చింది అడిగి తెలుసుకున్నారు.

పత్తి, మొక్కజొన్నల పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేపట్టాలని మంత్రి రైతులకు వివరించారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు పొలం వద్ద ఆగి పామాయిల్ సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం లాభాలు ఉంటాయని వివ రించారు. మొక్కలు, డ్రిప్ పరికరాలు, ఎరువులు సబ్సిడీ సాయం అందిస్తామని పామా యిల్ సాగు తో రైతులకు మహర్దశ పడుతుందని మంత్రి వెల్లడించారు.

ఆకాలవ ర్షాలు, రాళ్ళవానలు, చీడపీడలు, కోతులు, అడవి పండులతో ఇబ్బందులు ఉండవని, మందులు, ఖర్చులు తక్కువని అన్నారు. మంచి డిమాండ్ ఉందని, పండిన పంట మార్కెటింగ్ కి ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. గ్రామాల్లో నేతలు, ఉద్యాన శాఖ అధికారులు పామాయిల్ సాగు ప్రోత్సహించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఈ కా ర్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులుపాల్గొన్నారు.