13 April, 2026 | 1:46 AM

ఆ చౌరస్తాలు.. మృత్యుపాశాలు!

13-04-2026 12:04 AM
  1. చారకొండ బైపాస్పు పొంచి ఉన్న ప్రమాదం
  2. అండర్ పాస్ లు నిర్మాణంతో ప్రమాదాలకు అడ్డుకట్ట
  3. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాహనదారులు 

చారకొండ, ఏప్రిల్ 12: అభివృద్ధికి బాటలు వేయాల్సిన జాతీయ రహదారి విస్తరణ.. చారకొండ మండల కేంద్రంలోని ప్రజ లకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. జడ్చర్ల - కోదాడ హైవేలో భాగంగా కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డు ఇప్పుడు ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఈ బైపాస్ పై వాహనాలు రయ్యిమని దూసుకెళ్తుంటే, వా టిని దాటలేక స్థానికులు, ముఖ్యంగా రైతు లు బెంబేలెత్తిపోతున్నారు.

ప్రమాదాలకు నిలయాలుగా చౌరస్తాలు..

బైపాస్ రోడ్డులో చెరుకుపల్లి చౌరస్తా, బ్రాహ్మణపల్లి చౌరస్తా, మర్రిపల్లి చౌరస్తాలు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అతివేగంతో వెళ్తుండటంతో, రోడ్డు దాటాలంటేనే జనం భయప డుతున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి చౌరస్తా, చెరుకుపల్లి చౌరస్తా అత్యంత ప్రమాదకరంగా మారాయి.

బ్రాహ్మణపల్లి వైపు నుంచి వచ్చే వాహనదారులకు బైపాస్ రోడ్డు ఎత్తుగా ఉండటంతో పాటు మలుపు ఉం డటంతో రహదారిపై వాహనాల రాకపోకలు కనబడకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో పాటు రాత్రి వేళలో లై టింగ్ లేకపోవడంతో వా హనదారులు, బాటసారులు రోడ్డును గుర్తించలేకపోతున్నా రు. నిత్యం ఈ చౌరస్తాలలో ప్రమాదాలు జ రుగుతున్నాయి. గతంలో ఇక్కడ జరిగిన ప్ర మాదాలు స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

అవగాహన లేక.. అల్లాడుతున్న రైతన్నలు

బ్రాహ్మణపల్లి, సింగరాజుపల్లి, మర్రిపల్లి పరిసర గ్రామ ప్రజలు ముఖ్యంగా రైతులు ఏ అవసరం ఉన్నా చారకొండ మండల కేం ద్రానికే వస్తుంటారు. బ్రాహ్మణపల్లిలో ఎక్కు వ పాడి రైతులు తమ పాలను విక్రయించడానికి ఉదయం, సాయంత్రం చారకొండకు వచ్చి పోతుంటారు. రైతులు తమ పొలాలకు వెళ్లాలన్నా, ఎరువులు, విత్తనాలు తీసుకురావాలన్నా ఈ బైపాస్ రోడ్డును దాటక త ప్ప దు. అయితే, జాతీయ రహదారుల భ ద్రతా నియమాలపై అవగాహన లే కపోవడం, వేగంగా వచ్చే వాహనాలను అంచనా వేయలేకపోవ డం వల్ల రైతులు తరచూ ప్రమాదా ల బారిన పడుతున్నారు.

ప్ర మాదకర చౌరస్తాల వద్ద అండర్ పా స్‌లు నిర్మిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవవచ్చని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా బ్రాహ్మ ణపల్లి చౌరస్తాలో అండర్ పాస్ నిర్మాణంతో పాటు హైమాస్ట్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పా టు చేసి, రైతులకు, గ్రామస్థులకు, వాహనదారులకు రహదారి భద్రతపై పోలీసుల ద్వా రా అవగాహన కల్పించాలని కోరుతున్నారు.