15-11-2025 12:48:10 AM
ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోట, భగత్నగర్, విద్యానగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
విద్యార్థులకు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. వివిధ రకాల వస్త్రధారణతో విద్యార్థులు అలరించారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వష శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుపాల్గొన్నారు.