calender_icon.png 15 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో బాలల దినోత్సవం

15-11-2025 12:51:39 AM

కొత్తపల్లి, నవంబరు 14 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు జోరుగా.. హుషారుగా సాగాయి.  ముఖ్యఅతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవ వేడుకలకు మన భారతదేశంలో ప్రత్యేకత ఉన్నదని, యావత్ భారతదేశం చాలా గొప్పగా నిర్వహిస్తుందని అన్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సేవలు చాలా విశిష్టమైనమని, భారతదేశ కీర్తిని వ్యాపింప చేశారని అన్నారు. విద్యార్థుల సంస్కృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.