27 April, 2026 | 2:44 AM

చింతమడక ఫీల్ అసిస్టెంట్‌కు ఉత్తమ సేవల గుర్తింపు

27-04-2026 01:00 AM

కూలీల హాజరు నమోదులో రికార్డ్ అవార్డు నగదు బహుమతి..

సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 26: సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని చింతమడక గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకుడు (ఫీల్ అసిస్టెంట్) కాసిరెడ్డి అమరేందర్ రెడ్డి కూలీలు 200 మందికి పైగా ఎన్‌ఎంఎంఎస్ హాజరు నమోదు చేసి ఉత్తమ సేవలు అందించినందుకు గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ విజయలక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ కే. హైమవతి గారి సమక్షంలో ఉత్తమ ఫీల్ అసిస్టెంట్ గా అవార్డు, తో పాటు1000 రూపాయల నగదు బహుమతితో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ జయదేవ్ గారు జెడ్పీ సీఈవో రమేష్ గారు, డీపీఓ రవీందర్ పాల్గొన్నారు. అధికారులు ఫీల్ అసిస్టెంట్ సేవలను ప్రశంసిస్తూ మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.