సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ
27-04-2026 01:01 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని తెలిపారు. ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ప్రావీణ్య ఆర్‌అండ్ బి డిపార్టుమెంట్ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాధురి, కలెక్టరేట్ సిబ్బంది నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






