హీరో లేకుండా సినిమా తీస్తా
సందీప్ వంగా మూవీ మేకింగ్ స్టుల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా తనకంటూ భారీ ఎత్తున ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ‘యానిమల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సందీప్ వంగా సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యముంటుందని కామెంట్స్ సర్వసాధారణంగానే వినిపిస్తుంటాయి.
‘యానిమల్’ సినిమా విషయంలోనూ ఇదే కామెంట్ వినిపించింది. ఈ చిత్రంలో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సందీప్ వంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పాటలు లేకుండా సినిమా.. హీరో లేకుండా సినిమా.. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోండి’ అని అడగారు. దీనికి సమాధానంగా సందీప్ వంగా.. ‘హీరో లేకుండా సినిమా తీయాలనేది ఎప్పటి నుంచో నా ఆలోచన.
ఒకవేళ అలాంటి సినిమా తీస్తే నా చిత్రాలను విమర్శించిన మహిళలు హీరో లేకుండా తీసిన దాన్ని సైతం ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని రాసిస్తా. హీరో లేకుండా సినిమా అయితే 4, 5 ఏళ్లలో తీస్తా. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా అప్పుడు నేను చెప్పింది చేసి చూపించా” అని మాట్లాడుకుంటారని అన్నారు.






