17 April, 2026 | 8:28 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

జీవితంలో ఒక మైలురాయిని ఎంచుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలి

07-06-2025 08:52 PM

ఎస్సై డి. స్రవంతి..

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థి దశలోనే ఒక మైలురాయిని ఎంచుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ముందుకుసాగాలని దోమకొండ ఎస్సై డి. స్రవంతి(SI D Sravanthi) అన్నారు. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముదాం శ్రీవల్లి పదవ తరగతిలో 566 మార్కులు సాధించింది. శ్రీవల్లి భిక్కనూరు మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్ లో పదవ తరగతి  పూర్తి చేసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థి శ్రీవల్లిని ఎస్సై శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం ఎస్సై మాట్లాడుతూ... అనుకున్న గోల్ ను రీచ్ అయ్యేంతవరకు కష్టపడాలన్నారు. సాధించాలనే తపన దృఢంగా ఉంటే అనుకున్నది జీవితంలో తప్పకుండా చేరుకోగలమని సూచించారు. ఎంతటి వడిదడుగులు వచ్చిన చదువులో ముందుండాలని, కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని  తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో  హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, స్వామి  పాల్గొన్నారు.