17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సర్కార్ బడి... పిలుస్తుంది

07-06-2025 08:49 PM

బడి బాట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ధాశిరాం..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): తల్లిదండ్రులు, తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల లింగారెడ్డిపేట ప్రధానోపాధ్యాయులు, ధాశీరాం అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని, 11వార్డ్ లోని పలు విధుల్లో పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడి బాట కార్యక్రమం నిర్వహించారు. బడి బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్య, ముందంజలో ఉందని పేర్కొన్నారు. బడిబాటలో భాగంగా, బడీడు పిల్లలను గుర్తించి, తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజన వసతులను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.