calender_icon.png 24 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు

24-12-2025 12:15:32 AM

మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 23 : క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి, డాక్టర్ సామ్యెల్,డాక్టర్ జె. రాంమోహన్కి కేక్  తినిపించి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ అందరికీ శాంతి, సౌఖ్యం, సోదరభావం నింపాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, ఐఎంఎ  అధ్యక్షులు డాక్టర్ రాంమోహన్, డాక్టర్ సామ్యెల్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, సిజె బెనహర్, అజ్మత్ అలి,  మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాషెద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.