24-12-2025 12:14:39 AM
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): దేశ సమగ్రాభివృద్ధి విద్యార్థులు, ఉపాధ్యాయుల పురోగతిపై ఆధారపడి ఉంటుందని సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్.ఐ.సి.సి నోవాటెల్ లో హైబిజ్ టీవీ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నిర్వహించగా.. లక్ష్మీనారాయణ హాజరయ్యా రు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు 20కి పైగా పురస్కారాలు రావడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
డాక్టర్ ప్రీతిరెడ్డి (వైస్ ఛైర్‌పర్సన్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్), వై. గురుస్వామి నాయుడు (ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్,- సెల్‌కాన్ గ్రూప్), శ్రీనివాస్‌మూర్తి (డైరెక్టర్,- టీవీ5 న్యూస్), నరేంద్ర రామ్ నంబుల (లైఫ్ స్పాన్), ఏఆర్వీ బద్రీనాథ్ (సీజీఎం- టీజీ, ఏపీ ఐఓసీఎల్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ, హైబి జ్ టీవీ), డాక్టర్ జె. సంధ్యారాణి (హైబిజ్ వన్ ఫౌండర్, ఎండీ) ఇందులో పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు.
స్కూళ్లు అందుకు తొలి అడుగని తెలిపారు. మార్కులు సాధించడం.. పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడం మాత్రమే కీలకం కాదని.. సరైన నడవడిక, ఇతరులతో మాట్లాడే విధానం.. సత్సంబంధాలు ఏ వి ధంగా పెంచుకోవాలి.. అనేవి కూడా ముఖ్యమని వివరించారు. హైబిజ్ టీవీ ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్స్ అవారడ్స్ - 2025లో భాగంగా 50కి పైగా పురస్కారాలను అందజేశారు. అందులో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు 20కి పైగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు అన్ని ప్రాంతాల నుంచి విద్యా సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ఇచ్చారు.