24-12-2025 12:16:45 AM
వేముల గ్రామంలో తాగునీటి గోస, సాగుకు నీరు విడుదల చేయాలని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): దేవరకద్ర నియోజకవర్గం లోని పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయెoదిర బోయి ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సర్పంచులతో కలిసి కలిశారు. వేముల గ్రామంలో పాత పూడ్చి వేదతోపాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. కోయిల్ సార్ ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని విన్నవించారు.
ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి సమస్యతో పాటు రైతులకు సాగునీరు అవసరమైన సమయంలో విడుతల వారిగా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు.