గోదావరిఖని లో ఎన్ టియుసి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
పాల్గొన్న రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్, ఎన్ టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్
మంథని,(విజయక్రాంతి): క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా గోదావరిఖనిలోని జనక్ భవన్‌లో ఐ ఎన్ టియుసి ఆర్జీ-1 ఆధ్వర్యంలో గురువారం ఘనంగా క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కేక్ కట్ చేసి కార్మికులందరికీ హృదయపూర్వక క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు ప్రేమ, త్యాగం, మానవ సేవ సందేశం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అన్ని మతాల మధ్య సోదరభావం, శాంతి, సమానత్వం బలపడాలనే లక్ష్యంతో ఐఎన్ టీయూసీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం సంఘటిత పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్ సదానందం, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్, వడ్డేపల్లి దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, జీవన్ జోయెల్, గడ్డం వెంకటేశ్వర్లు లత తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




