25-12-2025 04:46:42 PM
కోదాడ, స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.వేకుజామునుంచి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ, నలిగిన హృదయాలు గలవారికి బలమిచ్చేందుకు, పాపబంధకాలలో బాధపడుతున్న వారికి విముక్తి కలిగించేందుకు, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పునిచ్చేందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని అన్నారు. సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మధ్యవర్తిగా యేసు ప్రభువు బలియాగం ద్వారా రక్షణను అందించాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి, పీఆర్‌టీయూ జిల్లా నాయకులు బుల్లికొండ కోటయ్య, హెడ్ కానిస్టేబుల్ జాన్, గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గు నాయక్, స్రవంతి, మోజస్, జ్యోతి, భాగ్యశ్రీతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే గాయని గాయకులు సునీత, సుధ, కృష్ణవేణి, కవిత, సునీత, సీత తదితరులు ఆలపించిన క్రిస్మస్ గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.