క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి
బోథ్,(విజయక్రాంతి): క్రీడల వల్ల యువత శారీరక దృఢత్వం క్రమశిక్షణ ఐక్యత భావం పెరుగుతుందని సిఐ డి.గురుస్వామి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ మైదానంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోటీలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలు విద్య ఉపాధి సాధనాలపై దృష్టి సారించాలని కోరారు. బోత్ సోనాల మండలాల్లో 24 జట్లు పోటీల్లో పాల్గొనగా రెండు రోజులపాటు క్రీడ పోటీలను నిర్వహిస్తామన్నారు.
పోటీలో గెలుపొందిన వారికి మొదటి విజేతకు 5000 రెండవ విజేతకు 300 నగదు అందిస్తామని, ట్రోపీని ప్రధానం చేస్తామన్నారు ఈనెల 18 నిర్వహించనున్న గుట్ట పక్క తండా తాండ గ్రామంలో జరగనున్న పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా బహుమతులను అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సై వి .పురుషోత్తం, ఫ్రెండ్స్ క్లబ్ చైర్మన్ వైద్య సురేష్ ,బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎలుక రాజు, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.






