కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-44పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన లగ్జరీ నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ జేబీఎస్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా, సాయిబాబా ఆలయం సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బస్సు డ్రైవర్ బాలయ్యకు గాయాలయ్యాయి.
అయితే బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీఎంఆర్ అంబులెన్స్ సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






