calender_icon.png 3 December, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్‌'

03-12-2025 08:43:15 PM

సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో విద్యార్థులకు సూచనలు చేసిన సీఐ గోవిందరెడ్డి..

మేడిపల్లి (విజయక్రాంతి): మేడిపల్లి పోలీసులు శ్రీ చైతన్య మహిళ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు బుధవారం శ్రీ చైతన్య మహిళ కళాశాల పీర్జాదిగూడలో సుమారు 800 మంది విద్యార్థులతో "సైబర్ సారధి" అనే తీమ్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ భద్రత మోసం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది.

ఆర్థిక మోసాలు జరిగిన వెంటనే 1930 కు కాల్ చేయడం ద్వారా వెంటనే పోలీసులు, బ్యాంకులో మోసపోయిన మొత్తాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సైబర్ మోసం జరిగిన మొదటి గంట అత్యంత కీలకం. ఆ సమయంలో రిపోర్ట్ చేస్తే డబ్బులు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1930 కి కాల్ చేస్తే సంబంధిత ఖాతాని పుటాన్ హోల్డ్ ఆప్షన్ ఉంటుంది. తద్వారా మోసగాళ్లు తమ డబ్బును ఉపసంహరణ చేయకుండా అడ్డుకుంటారు. ప్రజలు ప్రతిరోజు కోట్ల రూపాయల మేరకు సైబర్ మోసాలకు గురవుతున్నారని, అవగాహనతో తక్షణ ఫిర్యాదు చేస్తే నష్టాలు తగ్గించవచ్చని వివరించారు.

ఏఐ చాట్ బాట్ ద్వారా వేగవంతమైన రిపోర్టింగ్ వస్తుంది. "సైబర్ సారధి"లో భాగంగా త్వరితగతిన మార్గదర్శకత్వం వహించడానికి ఫిర్యాదులను వాయిదా లేకుండా నమోదు చేయడానికి గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ పెంచడానికి తెలంగాణ పోలీసులు ఏఐ సైబర్ సహాయక చాట్ బాట్ ను ప్రవేశపెట్టారు. ప్రతిరోజు యూపీఐ, సోషల్ మీడియా, ఉద్యోగాలు ,పెట్టుబడులు, ఓటీపీ కస్టమర్ కేర్ నెంబర్ అనేక ఫిర్యాదులు పెద్ద ఎత్తున 1930  వస్తున్నాయి. అనుమానాస్పదమైన సైబర్ కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అవగాహన కల్పించాలని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.