03-12-2025 08:38:41 PM
సిద్దిపేట క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి రూ.51 వేలు జరిమానా పడిందని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పలు చౌరస్తాల వద్ద బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా, ఐదుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బుధవారం వారిని సిద్దిపేట ఒకటో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా, విచారణ చేసి రూ.51వేలు జరిమానా విధించారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.