బాలిక అదృశం
19-09-2025 11:25 PM
జిన్నారం: బొల్లారం పట్టణానికి చెందిన శివాని కుమారి(13) అనే బాలిక కనిపించడం లేదని సీఐ రవీందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రాజన్ దాస్ కుటుంబంతో కలిసి గత కొంతకాలంగా మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ లో నివసిస్తున్నారు. శివాని కుమారి వైఎస్ఆర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. కాగా ఈనెల 18వ తేదీ సాయంత్రం తమ్ముడు, చెల్లెలితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె గురించి బొల్లారం మల్లంపేట్, బాచుపల్లి ప్రాంతాలలో వెతికిన ఆచూకీ తెలియలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. బాలిక ఆచూకి తెలిస్తే బొల్లారం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.




