20-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఇంజినీరింగ్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు 8 వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనీ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకి కనీస వేతనాలు కల్పించడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహి స్తుందన్నారు. తక్షణమే 8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
2026 జనవరి నుండే వేతన పే కమిషన్ అమలు చేయాలనీ కోరారు. మ జ్దూర్ యూనియన్ నాయకులు బాబురావు, భాస్కర్ రావు, రాజు, మహేష్, లక్ష్మి, వెంక ట్ రత్నం, కనకయ్య, జైల్ సింగ్, అనిల్, మ హేష్, రాజు, సంతోష్, ప్రశాంత్, గుం లాల్, గోపీలాల్, నవీన్, శ్రీనివాస్, షాణిపాషా, రవికుమార్, ఉపేందర్, లత, పద్మ, రాజశేఖర్, కృష్ణ రెడ్డి, వరుణ్, వంశీ పాల్గొన్నారు.