సింగరేణి సీఎంవోపై సీఐడీ విచారణ?
నాలుగేళ్ల మెడికల్ బోర్డ్‌పై అవినీతి ఆరోపణలు
భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన సింగరేణి ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సింగరేణి ఉద్యోగులను మంగళవారం సీఐడీ ఎస్సై శేషగిరిరావు విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కారుణ్య నియామాకాలకు మూలమైన మెడికల్ అన్‌ఫిట్ మెడికల్ బోర్డు సర్టీఫై చేయాల్సి ఉంటుం ది. ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు సీఐడీ అధికారులు కొంతమంది సింగరేణి ఉద్యో గులను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 2020- --నుంచి 2024 సంవత్సరాల కాలంలో మెడికల్ అన్‌ఫిట్‌పై కారు ణ్య నియమాకాలు పొందిన వారి నుంచి వాంగ్మూలం తీసుకొన్నట్టు తెలిసింది.






