13-11-2025 12:40:27 AM
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను దుల్కర్, రానా విలేకరులతో పంచుకున్నారు. రానా మాట్లాడుతూ “ఇది బయోపిక్ కాదు.
కంప్లీట్ ఫిక్షనల్ కథ. -ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు (నవ్వుతూ). సినిమానే మాకు అంతా ఇచ్చింది. సినిమాకు మేము తిరిగివ్వాలి. అలాంటి అవకాశం ఈ సినిమాతో వచ్చిందని” అన్నారు. ‘ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. -మేము సినిమాను ప్రేమిస్తాం. సినిమానే మాకు ఇంధనం. ‘కాంత’ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. చాలా అరుదైన సినిమా ఇది’ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.