17 April, 2026 | 8:24 PM

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఖబర్దార్

17-04-2026 06:44 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ మాట్లాడటం తీవ్రంగా ఖండించదగినదని  డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అవమానించడం మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రను తక్కువ చేసి మాట్లాడటమే అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది దశాబ్దాల పాటు జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితం. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాసంఘాలు కలిసి చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధ్యమైంది.

ఈ చారిత్రక ఉద్యమాన్ని విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించడం తప్ప మరొకటి కాదని వాపోయారు.  బీజేపీకి ఇది మొదటి సారి కాదని, సందర్బo వచ్చినప్పుడలా తెలంగాణా పైన విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క్షమాపణ చెప్పాలని నర్సయ్య డిమాండ్ చేశాడు.