calender_icon.png 13 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రాకే కింగూ..

13-11-2025 12:41:34 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ నాలుగో పాటగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ను విడుదల చేశారు. విమల్ థియేటర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అభిమానుల చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ అయింది. ‘ఆల్ ఆఫ్ యూ సింగూ.. ఆంధ్రాకే కింగూ..’ అంటూ సాగుతోందీ పాట. దినేశ్ కాకర్ల రాసిన ఈ పాటకు వివేక్ స్వరాలు సమకూర్చగా, అభిమానులు పాడారు. ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.