28 August, 2026 | 1:55 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

గంజాయి కేసులో ఇద్దరు అరెస్టు

03-05-2026 01:35 PM

- 190 గ్రాముల గంజాయి పట్టివేత

- రెండు గంజాయి మొక్కలు స్వాధీనం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసుల అరెస్టు చేశారు. ఇంటి పై సోదా చేసి 190 గ్రాముల గంజాయి, రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తాళ్ళగురజాల ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..బట్వాన్ పల్లి గ్రామంలో దాగం రోహిత్ అనే వ్యక్తి  ఇంట్లో  గంజాయి  ఉన్నదని సమాచారంతో పోలీసులు  ఆయన ఇంటిని సోదాచేశారు.

ఇంటిని సెర్చ్ చేయగా అతని ఇంటిలో ఎండు గంజాయి దొరికింది. గంజాయి ని మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి తన స్నేహితుడు జుమ్మిడి రాజశేఖర్ తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి చుట్టుపక్కల విక్రయిస్తున్నారు. గంజాయి తాగే వారికి అమ్ముతున్నారు. రాజశేఖర్ ఇంటి నీ కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఎండు గంజాయి లభించింది. రాజశేఖర్ ఉంటున్న ఇంటి చుట్టుప్రక్కల పోలీసులు సెర్చ్ చేశారు. ఇంటి  వెనుక పెరడు లో రెండు గంజాయి మొక్కలు కనిపించాయి. 

మహారాష్ట్ర నుంచి ఎండు గంజాయి తీసుకురావడం కన్నా  ఇక్కడే గంజాయి మొక్కలు నాటితే లాభదాయకమని నిందితులు మొక్కలు నాటారు. ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని గంజాయి విత్తనాలు నాటి మొక్కలు పెంచుతున్నారు. ఇద్దరి నుంచి 690 గ్రాములు ఎండు గంజాయి,  రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత మారకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరిని  జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  ముందు హాజరు పర్చీ రిమాండ్ చేసినట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.