7 May, 2026 | 3:10 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ నిరసన

06-02-2025 12:00 AM

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతుల దహనం

కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 5( విజయ క్రాంతి): కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్  కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకంగా ఉందని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర బడ్జెట్ ప్రతు లను  దహనం చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా  కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లా డుతూ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బిజెపి మతోన్మాద ఆర్థిక దివాలకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు మున్సిపల్ గ్రామపంచాయతీ ఆశ అంగన్వాడి  మధ్యాహ్నబోజనం ఐకేపీ. అసంఘటిత రంగ కార్మికులకు  పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు.

ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రాజనర్సు,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్.మున్సిపల్ ఉపాధ్యక్షులు ప్రభు  నాయకులు సంతోష్, నరేష్, ప్రభాకర్, హెల్ది సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, ప్రశాంత్, మల్లేష్ రాజ్, కళ్యాన్, లింగం, నవీన్ పాల్గొన్నారు.