10 April, 2026 | 2:16 AM

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులు వేగవంతం చేయాలి

10-04-2026 12:54 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్‌లో డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎల్.పి.జి. సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు, పైప్లైన్ సహజ వాయువు విని యోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు.

అనుమతుల ప్రక్రియను సరళీకరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులకు సంబంధించిన అనుమతు లను 24 గంటలలో మంజూరు చేసే విధానా న్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ఆలస్యం అయితే డీమ్డ్ పర్మిషన్‌గా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన విద్యా బోధన అందించాలి

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ మండలం సీతారాంపల్లి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, మూత్రశాలలు, రిజిస్టర్లను పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సి పాల్ పద్మజ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.