అంగన్వాడీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ముషీరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): అంబర్పేట్ నియోజకవర్గంలో అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు.
మేరకు గురువారం అంబర్ పేటలోని గోల్నాక ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లా డుతూ నియోజకవర్గంలోని 34 అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించా మని చెప్పారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాలకు శాశ్వత భవనా లు నిర్మించేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే టీచర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




