28 August, 2026 | 3:41 AM

నేపాల్ వరదల్లో నగర యువతి గల్లంతు

28-08-2026 02:00 AM

ఎల్బీనగర్ వాస్తు కాలనీలో ఆందోళన

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం

ఆచూకీ చెప్పాలని ప్రభుత్వానికి కుటుంబసభ్యుల విజ్ఞప్తి

ఎల్బీనగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతయ్యింది. ఎల్బీనగర్ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన కందిమల్ల మహేందర్ రెడ్డి కుమార్తె సుహాసినిరెడ్డి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. అమెరికా నుంచి స్నేహితురాలితో కలిసి వచ్చిన సుహాసిని 23న మానస సరోవర్ యాత్రకి వెళ్లింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసినిరెడ్డి ఫోన్ కలవకపోవడం, ఆమె వెళ్లిన ప్రాంతాల్లో వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళ నకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే యాత్రికుల సమాచారం చెప్పాలని,  సురక్షితంగా తీసుకురావాలని కోరారు.