నేపాల్‌లో మరణమృదంగం
- ప్రకృతి ప్రళయానికి 3౯౨కు చేరిన మృతుల సంఖ్య
- 1,౬00 మంది గల్లంతు
- 290 మంది భారతీయుల ఆచూకీ లేదు
- మానసరోవర్ యాత్రలో చైనా వైపు చిక్కుకున్న మరో 200 మంది భారతీయులు
- ఈశా ఫౌండేషన్ సభ్యుల్లో 80 మంది అదృశ్యం
- తెలంగాణ నుంచి 22 మంది మిస్సింగ్ : మంత్రి పొంగులేటి
- మేం క్షేమంగానే ఉన్నాం: డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి
న్యూఢిల్లీ/ఖాఠ్మాండు, ఆగస్టు 27: ప్రకృతి ప్రళయానికి నేపాల్‌లో మరణమృందంగం మోగుతోంది. ఆకస్మిక భారీ వరదల్లో మృతుల సంఖ్య 392కి చేరింది. మృతుల్లో 389 మంది నేపాల్‌లో, మరో ముగ్గురు టిబెట్‌లో మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 1,600 మంది గల్లంతయ్యారు.
ఈ జలవిలయంలో 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. అలాగే కైలాష్ మానసరోవర్ యాత్రలో ఉన్న దాదాపు మరో 200 మంది భారతీయులు చైనా వైపు చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించినట్లు ఎంఈ ఏ, నేపాల్ పోలీసులు తెలిపారు.
గల్లంతైన పర్యాటకుల సంఖ్యలో భారతదేశం అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత అమెరికా నుంచి 65 మంది, ఉక్రెయిన్ నుంచి 53 మంది, మలేషియా నుంచి 51 మంది ఉన్నారు. టిబెట్‌లో 558 మంది గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 260 మంది విదేశీయులు ఉన్నారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. నేపాల్‌కు కొత్త వరద ముప్పు అతిత్వరలోనే ఉందని చైనా హెచ్చరించింది. నేపథ్యంలో, 37.5 టన్నుల మానవతా సహాయ సామాగ్రి (హెచ్‌ఏడీఆర్), మందులు, ఆహార ప్యాకెట్లతో కూడిన రెండో విడత సహాయాన్ని భారత్ నేపాల్‌కు అప్పగించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
300 మంది ఈశా ఫౌండేషన్ సభ్యుల్లో 80 మంది అదృశ్యమయ్యారని, ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కన్నీరు పెట్టారు. ‘మేం క్షేమంగానే ఉన్నామని డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి 22 మంది పర్యాటకులు మిస్సయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కొండచరి యలు విరిగిపడటంతో వరదలు సంభవించి, బీభత్సాన్ని సృష్టించాయి. నేపాల్ టిబెట్ సరిహద్దు ఆ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ ఆకస్మిక వరద వల్ల భోటేకోషి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతా ల గుండా తీవ్ర విధ్వంసం జరిగింది.
ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమ య్యాయి. విశాలమైనప్రాంతాలు బురద, రాళ్లు, శిథిలాలతో నిండిపోయాయి. రసువా, నువాకోట్లలో అత్యంత తీవ్రమైన నష్టం జరిగింది. రసువాలోని తిమురే, రసువాగధిలో, భోటేకోషి నది వెంబడి ఉన్న నివాసాలకు, మౌలిక సదుపాయాలకు వరద తీవ్ర నష్టం కలిగించింది. ఈ రెండు పట్టణాలు నేపాల్- సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. నువాకోట్‌లోని బెట్రావతి నుంచి రాసువాగఢి వరకు ఉన్న 42 కిలోమీటర్ల రహదారి మొత్తం పలుచోట్ల దెబ్బతిన్నదని, అనేక కాంక్రీట్ వంతెనలు కొట్టుకుపోయా యని రహదారుల శాఖ తెలిపింది.
అలాగే నువాకోట్‌లోని దిగువన, త్రిశూలి బజార్, సమీప ప్రాంతా లలో విధ్వంసం చాలా తీవ్రంగా ఉంది. ఈ వరద త్రిశూలి, దేవిఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఇతర విద్యుత్ మౌలిక సదుపాయా లను కూడా దెబ్బతీసింది. వరదల కారణంగా 35 వంతెనలు, 45 వేలాడే వంతెనలు, 40 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలిపింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలలో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. నేపాల్ భారత్, చైనాల సహా యాన్ని కోరింది. భారీ విధ్వంసం, కఠినమైన భూభాగం సహాయక చర్యలను క్లిష్టతరం చేస్తున్నా యి. విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, తనాహున్, చిత్వాన్, నవల్పరాసి జిల్లాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. భోటేకోశి, త్రిశూలి, నారాయ ణి వంటి ప్రధాన నదుల ఒడ్డుకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
భారత్ నేపాల్‌కు సాయం
వినాశకరమైన వరదల అనంతరం సహాయక చర్యలకు మద్దతుగా భారత్ నేపాల్‌కు 47 టన్నుల మానవతా సహాయా న్ని అందజేసింది. అలాగే భారీ వరదల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా, ఢిల్లీ ప్రభుత్వం ‘భారత్- మైత్రీ బస్సు సేవల’ను నేడు, రేపు (28, 29 తేదీల్లో) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ఉత్తర్వు జారీ చేసింది. నేపాల్ విలయంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రపంచ సంస్థ తొలి విడతగా 2 మిలియన్ డాలర్లను కేటాయించింది.
నేపాల్‌కు మరో వరద ముప్పు
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోషి నది పుట్టుక ప్రాంతం (మూలం) స మీపంలో ఒక కొత్త అడ్డంకి సరస్సు ఏర్పడి ంది. దీంతో ఆ నది దిగువ ప్రాంతాల్లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. ఆ సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోందని, రాబోయే రోజుల్లో మరింత నీరు చేరడంతో అది తెగిపోయే ప్రమాదం ఉందని బీజింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ)ని ఉటంకిస్తూ ది కాఠ్మండు పోస్ట్ గురువారం పేర్కొంది. గురువారం ఉదయానికి ఈ సరస్సులో సుమారు 20 లక్షల (2 మిలియన్ల) క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని, రాబోయే మూడు రోజు ల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం ఉం దనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2౯౦ మంది భారతీయుల గల్లంతు: ఎంఈఏ
నేపాల్‌లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల కారణంగా ౨౯౦ మంది భారతీయులు ఆచూకీ లేకుండా పోయారని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది. 53 మంది కేరళీయులు చిక్కుకుపోయారని ‘నోర్కా రూట్స్’ తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించామని ఎంఈఏ చెప్పింది. నిర్మాణంలో ఉన్న త్రిశూలి-1 రన్-ఆఫ్-రివర్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63మంది కార్మి కులతో సహా మొత్తం 84మంది భారతీ యులను రక్షించారు. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మొత్తం 106 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. వీరిలో 86 మంది గల్లంతయ్యారు. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
చెన్నై నుంచి బయలుదేరిన మరో 49మంది ఆచూకీ తెలియలేదు. గుజరాత్‌కు చెందిన 11 మంది గల్లంతయ్యారు. ఒక మహిళ ప్రాణాలతో బయటపడింది. పశ్చిమ బంగాల్‌కు చెందిన 32మంది గల్లంతయ్యా రని సీఎం సువేందు అధికారి తెలిపారు. ఒడిశాకు చెందిన ఒక ఎన్‌ఆర్‌ఐ జంట అదృశ్యమైంది. ఖుర్దా జిల్లాకు చెందిన సందీప్ మహాపాత్ర, ఆయన భార్య సిద్ధార్థి కుమారి సాహు గత్లంతయ్యా రని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి 23 మంది పర్యాటకులు గల్లంతయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేపాల్‌లో గల్లంతైన 23 మందిలో ఆరుగురు రాష్ట్రానికి చెందిన వారుగా, 17మంది ప్రవాస తెలంగాణ అని పేర్కొన్నారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఉన్నారని మిగతా 22మంది ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. కర్ణాటకకు చెందిన 13 మంది చిక్కుకుపోయారని కర్ణాటక సీఎంఓ తెలిపింది. మహారాష్ట్రకు చెందిన కనీసం 114 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని, వీరిలో 53 మంది సురక్షితంగా ఉన్నారని ఎస్‌ఈఓసీ తెలిపింది. నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు.
ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కన్నీరు
నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద బీభత్సంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈశా ఫౌండేషన్ బృందం చిక్కుకుపోయింది. కైలాస మానస సరోవర యాత్ర నిమిత్తం వెళ్లిన సుమారు 300 మంది ఈశా ఫౌండేషన్ సభ్యులు యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ జల విలయంలో చిక్కుకున్నారు.
వీరిలో 80 మంది యాత్రికుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారిలో 50 మంది భారతీయ పౌరులు కాగా, మిగిలిన వారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 19 దేశాలకు చెందిన వారని గుర్తించారు. పస్తుతం సద్గురు జగ్గీ వాసుదేవ్ సురక్షితంగా టిబెట్ పరిధిలోనే ఉన్నారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవస రమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు టిబెట్‌లోని గైరాంగ్ ప్రాంతానికి వెళ్లేందుకు వెంటనే ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఈశా ఫౌండేషన్ వర్గాలు చైనా ప్రభుత్వాన్ని కోరాయి.
కాగా ఈ మహా ప్రళయంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఎంతటి విధ్వంసం జరిగిందో చూడండి. అదంతా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నేను ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు గురువారం ప్రయత్నించా ను. కానీ విధ్వంసం వల్ల అన్ని మార్గాలు మూసుకుపోయాయి. మన బృందం ఉన్న భవనం మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది. వారం క్రితం నేను అదే ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నాను. ఇప్పుడు ఆ భవనమే లేదు’ అని జగ్గీ వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.






