22 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు
05-06-2026 04:26 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 7 నుంచి 22 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధిత ఏసీపీ అనుమతి పొందాలని సూచించారు. వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని సూచించారు.






