calender_icon.png 1 May, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌర హక్కుల దినోత్సవం

30-04-2025 05:29:30 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని బోమ్మాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) మండల పంచాయతీ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మాట్లాడుతూ... పౌరులకు కల్పించిన హక్కులను, భారత రాజ్యాంగ చట్టాలను గ్రామసభలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, అటవీ బీట్ ఆఫీసర్ శ్యామ్, విద్యుత్ లైన్మెన్, అంబేద్కర్ ఆల్ ఇండియా యువజన సంఘం అధ్యక్షులు మెరుగు లక్ష్మణ్, లింగాల రామయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.