28-06-2025 12:24:29 PM
ప్రభుత్వ పథకాలను అందించాలని ఎంపీఓ కు బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ వినతి
హన్వాడ: చెంచు కుటుంబాలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారి దరి చేర్చి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని బిజెపి నాయకులు రఘురాం గౌడ్(BJP leaders Raghuram Goud) అన్నారు. శుక్రవారం ఎంపీవో జగదీష్ కుమార్ కు ఎంపీడీవో కార్యాలయంలో పెద్ద ధర్పల్లి గ్రామంలో 8 చెంచు కుటుంబాలు ఉన్నాయని కేవలం ఒకే కుటుంబం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, మిగతా వారిని కూడా గుర్తించి అవసరమైన సదుపాయాలను కల్పించాలని కోరారు. చెంచు కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని వారి అవసరాలను గుర్తించి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామంలో చెంచు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు వెనుక