17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చదువు మానేసిన చిన్నారికి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్

28-06-2025 12:22 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) ను చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోగా,  అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిసగా మారి, శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు  లేకపోవడంతో స్కూల్ కు వెళ్ళడం మానేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా మారింది. శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాగ్రి ఇప్పించి, చిట్యాల కస్తూరిబా గాంధీ  హాస్టల్ లో చేర్పించారు.

అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు తామే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక, సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా ఫౌండేషన్ ద్వారా చేస్తామని చైర్మన్ అయిలి మారుతి తెలియజేశారు. అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే తమ ఫౌండేషన్ కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లావుడియా రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.