31 May, 2026 | 1:30 AM

ఎంపీడీఓ ఆఫీసులో ఉద్యోగుల ఘర్షణ

31-05-2026 12:49 AM
  1. సీనియర్ అసిస్టెంట్ వర్సెస్ పంచాయతీ కార్యదర్శి
  2. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కార్యాలయంలో ఘటన

గరిడేపల్లి, మే 30(విజయక్రాంతి): మం డల కేంద్రమైన గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య తీవ్ర వివాదం చో టుచేసుకుంది. సీనియర్ అసిస్టెంట్ మొయినుద్దీన్‌ను తన సర్వీసు రికార్డులో పేరు ఎం ట్రీ చేయకుండా వెళ్లొద్దు అంటూ మండలంలోని లచ్యతండాలో పనిచేస్తున్న కార్యదర్శి సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో సదరు కార్యదర్శి సుధాకర్‌పై సీనియర్ అసిస్టెంట్ మొ యినుద్దీన్ చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ తీవ్రంగా జరిగింది. అక్కడే ఉన్న సహ ఉద్యోగులు కొంతమంది అడ్డుకున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా ఇద్దరు ఉద్యోగస్తులు కా ర్యాలయం ఆవరణలో కొట్టుకోవడం మండలంలో సంచలనంగా మారింది.