అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం
20-12-2024 11:06 AM
హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాటలో అసెంబ్లీ సిబ్బందికి ఇబ్బంది కలిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న వైపు కొందరు కాంగ్రెస్ నేతలు పేపర్లు చించి విసిరారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరస్పర నినాదాలు, ఆరోపణలతో సభ హోరెత్తింది. సభ ఆర్డర్ లేకపోవగడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభాపతితో ప్రభుత్వ విప్ లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఫార్ములా- ఈ రేసుపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టబట్టారు.






