25 April, 2026 | 12:02 PM

తెలంగాణ అసెంబ్లీ వాయిదా

20-12-2024 10:48 AM

హైదరాబాద్: శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆందోళన విరమించాలని కోరినప్పటికీ సభ్యులు పట్టు వీడలేదు. దీంతో శాసన మండలిని 15 నిమిషాలు వాయిదా వేశారు మండలి ఛైర్మన్. ఫార్ములా ఈ- రేసుపై చర్చకు బీఆర్ఎస్ పట్టు బట్టింది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని స్పీకర్ తెలిపారు. మీరు అడిగేది వ్యక్తికి సంబంధించిందన్నారు. బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమన్నారు. బిల్లు అంశం తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామని స్పీకర్ తెలిపారు.