25 April, 2026 | 2:12 PM

Breaking News

మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం.. జాతీయ రహదారిపై మాజీ మంత్రి ధర్నా

25-04-2026 12:41 PM

మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం  

హైదరాబాద్: మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli Dayakar Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుకు మద్దతుగా వరంగల్ జిల్లా, రాయపర్తిలో మాజీ మంత్రి, తన కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కారు. రైతులతో కలిసి రాయపర్తి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 

మొక్కజొన్న కాంటాలు కాక, కాంట అయినవి ట్రాన్స్‌పోర్ట్ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమైన ఇంకా మక్క రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షనమే స్పందించి చర్యలు తీసుకునే వరకు ధర్నా ముగించే ప్రసక్తే లేదంటూ ఎర్రబెల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.