భూ భారతి ముఖ్యమైన బిల్లు: స్పీకర్
20-12-2024 11:48 AM
హైదరాబాద్: భూభారతి బిల్లుపై శాసనసభలో చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే విధంగా ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదని సూచించారు. భూ భారతి ముఖ్యమైన బిల్లు అని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల వేళ ఇలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించారు. బిల్లు ఆమోదం పొందాక బీఆర్ఎస్ సభ్యులను తన ఛాంబర్ కు పిలుస్తానని స్పీకర్ గడ్డ ప్రసాద్ తెలిపారు,






