భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సరైన ఆధారాలు చూపించే వరకు ఇరువర్గాలు ఆ భూమిలోకి వెళ్ళరాదు: తాసీల్దార్ ఉమారాణి
ఆళ్లపల్లి ఆగస్టు 14, (విజయక్రాంతి): దళితులకు 1977వ సంవత్సరంలో 20 కుటుంబాలకు రెండు గుంటల చొప్పున ఇంటి నిర్మాణాలకు కేటాయించారని ఆ భూమి ఆక్రమనకు గురైందని దళిత కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తాహసిల్దార్ గడ్డం ఉమారాణి మాట్లాడుతూ. రెండెకరాల 20 గుంటల భూమిని దళిత కుటుంబాలకు కేటాయించిన భూమి మండల కేంద్రానికి చెందిన కొందరు ఆక్రమించారని దళిత కుటుంబాలు ఆరోపిస్తూ తహసీల్ కార్యాలయాన్ని ఆశ్రయించడం జరిగిందని ఇట్టి విషయమై ఇరువర్గాల వద్ద ఉన్న పత్రాలను, పూర్తిస్థాయిలో పరిశీలించేంతవరకు అట్టి భూమిలోకి ఇరు వర్గాల ప్రజలు వెళ్లవద్దని అట్టి భూమిలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇట్టి విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని కనుక వివాదాస్పదమైన భూమిని ప్రభుత్వ ఆధీనంలోకీ తీసుకుని ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కనుక ఇరువర్గాలు పూర్తిస్థాయిలో సర్వే చేసి సరైన ఆధారాలను పరిశీలించేంతవరకు సంయమనం పాటించాలని సూచించారు.






