calender_icon.png 2 February, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య బాహా బాహి

02-02-2026 05:33:05 PM

ముదురుతున్న రాజకీయ వివాదాలు 

ఉప్పల్,(విజయక్రాంతి):  నాచారం డివిజన్లోని రైతు బజార్లో ఉన్న పబ్లిక్ బోర్ విషయంలో బిఆర్ఎస్ బిజెపి నాయకులు మధ్య ఘర్షణ  ఉద్దికతకు దారి తీసింది.కార్పొరేటర్ భర్త సాయి జెన్ శేఖర్ బిజెపి నాయకులు పోతగాని గోపాల్ గౌడ్  మధ్య  వాగ్దానం కాస్త  ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే నాచారం డివిజన్లోని  ఉన్న రైతు బజార్లో ఉన్న పబ్లిక్ బోరు కొద్దికాలంగా  పని చేయకపోవడంతో  స్థానికంగా ఉండే రైతు బజార్  ప్రభుత్వ బస్తి  దావకానకు డాక్టర్లు నర్సులు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నామని స్థానికుల ఫిర్యాదు మేరకు నాచారం కార్పొరేటర్ సొంత నిధులతో మరమ్మత్తులు చేసేందుకు ప్రత్యేక టీమ్ ని పిలిపించి పనులను ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న బిజెపి  నాయకులు ఇన్ని రోజులుగా బోరు మోటర్ రిపేర్ చేయించకుండా కాలయాపన చేశారంటూ ఇప్పుడు మేము రిపేరు చేయిస్తామని చెప్పిన తర్వాత  మీరు ఎలా వచ్చి రిపేరు చేపిస్తారంటూ కార్పొరేటర్ శాంతితో వాగ్దానం దిగారు.

దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దీంతో మహిళను చూడకుండా శాంతి పై అనుచిత వ్యాఖ్యలుచేయడం సబబు కాదంటూ భర్త శేఖర్  బిజెపి నాయకులు పోతగాని గోపాల్ గౌడ్ తో వాగ్దానం దిగారు. దీంతో పరస్పరంగా ఒకరిపై ఒకరు  దాడికి దిగారు. శాంతి భర్త శేఖర్ కు చేయికి  గాయం కావడంతో స్థానిక నాచారం పోలీస్ స్టేషన్ లో గోపాల్ పై ఫిర్యాదు చేశారు. ముందుగా శేఖర్  దాడి చేశారంటూ గోపాల్ గౌడ్ సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

డివిజన్లో చేస్తున్నఅభివృద్ధి  ఓర్వలేకదాడులు : శాంతి

ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రజాభివృద్ధి ద్యేయంగా ముందుకు వెళుతున్నందుకు  ఓర్వలేక కాంగ్రెస్ బిజెపి నాయకులు దాడులు చేస్తున్నారని ఇలాంటి దాడులకు భయపడేది లేదని  కార్పొరేటర్ శాంతి అన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా  నిర్వహిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తున్నామని నాపై బురదజల్లే ప్రయత్నం చేయడమే కాకుండా తన భర్త పై దాడి చేయడం సబబు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల రాగానే  ఏదో ఒక సమస్యను సృష్టించి రాజకీయం చేయడం డివిజన్ ఇతర పార్టీ నాయకులు అలవాటైపోయింది అన్నారు. డివిజన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో కూడా  తగిన బుద్ధి చెప్తారని ఆమె పేర్కొన్నారు