8 August, 2026 | 3:26 AM

కింది బస్తీలో వైభవంగా బోనాలు

08-08-2026 01:52 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 7(విజయక్రాంతి): మేడ్చల్  పట్టణంలోని కింది బస్తిలో నల్ల పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతియేటా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా నల్ల పోచమ్మ కు బస్తీ వాసులు పెద్దఎత్తున తరలివెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. బోనాలను సమర్పించి అందరూ అస్టరాయూరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.