18-01-2026 12:10:14 AM
సైబరాబాద్ పరిధిలో స్వచ్ఛందంగా పచ్చదనం శుభ్రత చర్యలు
శేరిలింగంపల్లి, జనవరి 17 (విజయక్రాంతి): ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్ర మైన వాతావరణంలో పోలీస్ సేవలు అం దించాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో శనివారం ప్రత్యేకంగా పచ్చదనం పరిశు భ్రత కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని స్టేషన్ ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడ ంతో పాటు క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న పాత వాహనాలు, కోర్టు కేసులకు సంబంధించిన వాహనాలు, అబాండెడ్ వాహనాలను సమగ్రంగా గుర్తిం చి వేరుచేసి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాల్లో క్రమబద్ధంగా నిలిపారు.
అదేవిధంగా స్టేషన్లలో రికా ర్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా పాత ఫైళ్లను వర్గీకరించి కార్యాలయ వ్యవస్థను పటిష్టం చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాల్లో మొక్కలు నాటు తూ పచ్చదనాన్ని ప్రోత్సహించడంతో పాటు పరిశుభ్రమై న పరిసరా లే ప్రజల విశ్వాసానికి పునాదని ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ మరోసారి స్పష్టం చేసింది. భద్రతతో పాటు పరిశు భ్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.