18 March, 2026 | 3:27 AM

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

18-03-2026 12:22 AM

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

హుజూర్ నగర్, మార్చి 17: పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు... 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ ప్రజా పాలన ప్రగతి పాలన విజయవంతం చేయాలన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు క్రమం తప్పకుండా  ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా ఉద్యానవన అధికారి  నాగయ్య, మిషన్ భగీరథ కరుణాకర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, తదితరులు,పాల్గొన్నారు.

ప్రభుత్వ హాస్పిటల్‌లో సాధారణ ప్రసవాలు పెంచాలి..

మేళ్లచెరువు, మార్చి 17 : ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలు పెంచే విధంగా సిబ్బంది కృషి చేయాలని,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య నిపుణులచే ప్రతి పిహెచ్‌సిలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.మంగళవారం మేళ్లచెరువు పిఎస్సి లో జరిగిన మెడికల్ క్యాంపును ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్..

మేళ్లచెరువు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలెక్టర్ హాస్టల్లోని గదులను, వంటగదిని పరిశీలించి,విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డిఎంహెచ్వో మాధవ్ కుమార్,డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యులు యశ్వంత్, మనీ ప్రజ్ఞ సాయి శ్రీ వెంకటేష్ సమీరా మెడికల్ అధికారి, వైస్ ప్రిన్సిపాల్ మధు ఇన్చార్జి తాసిల్దార్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ పద్మావతి ఉపసర్పంచ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.