చిట్టి బుర్రలు.. గట్టి ఆలోచనలు..
గుండాల, మార్చి 17 : మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రయోగాలు చూ పరులను మురిపించాయి. బడిలో పాఠాలు నేర్చుకోవడమే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేలా చిట్టి బుర్రలు, గట్టి ఆలోచనలు చేశాయి. మంగళవారం మోడల్ స్కూల్లో ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారు తయారుచేసిన ప్రాజెక్టులను జాగ్రత్తగా వివరించి, సృజనాత్మకతను జోడించి నిత్యజీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రయోగాలు చూసిన పలువురు సందర్శకులు ముగ్గులయ్యారు.
ఘనంగా ప్రయోగాలు తయారు చేసిన విద్యార్థులను, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి రాము, స్థానిక ఎస్‌ఐ యం తేజం రెడ్డి,సర్పంచులు దేవన బోయిన ఐలయ్య, అలం శెట్టి మహేష్, ఉపసర్పంచ్ రమేష్, సైన్స్ ఉపాధ్యాయులు కుంట రమేష్ కుమార్, కంబాల రమేష్, జోగు సోమన్న, రాజేందర్, మధుసూదన్ రావు, వివిధపాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




