16 April, 2026 | 10:49 AM

యూపీఐ చార్జీలు అవాస్తవం

12-06-2025 12:00 AM
  1. చార్జీలంటూ వైరల్ అయిన వార్తలను ఖండించిన ఆర్థిక శాఖ
  2. ఎటువంటి చార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం

ముంబై, జూన్ 11: యూపీఐ లావాదేవీలపై మరీ ముఖ్యంగా రూ. 3వేలు దాటిన లావాదేవీలపై చార్జీలు విధించనున్నారని బుధవారం వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది.

‘ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇటువంటి నిరాధారమైన ఊహాగా నాలు పౌరుల్లో అనవసర అనిశ్చితి, భయాందోళనలకు కారణం అవుతాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.’ అని ఎక్స్‌లో స్పష్టం చేసింది.